ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:47:35

రాజ‌స్థాన్ అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌పై చ‌ర్చ‌..

రాజ‌స్థాన్ అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌పై చ‌ర్చ‌..

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లో ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి.  సీఎం అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌కు సిద్ద‌మైంది. మంత్రి శాంతి ధ‌రివాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.  స్పీక‌ర్ జోషీ ఆ తీర్మానంపై చ‌ర్చ‌కు మూడు గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించారు.  ఈ నేప‌థ్యంలో మంత్రి ధ‌రివాల్‌ మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వంపై విరుచుకుప‌డ్డారు.  రాజ‌స్థాన్ మే నా షా కి చ‌లీ హై.. నా కిసీ తానేషా కీ అంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు.  ఆ స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు.  అమిత్ షా పేరును లేవ‌నెత్త‌రాదంటూ కోరారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ కొనుగోలు చేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు ధ‌రివాల్ ఆరోపించారు.  రాజ‌స్థాన్ సీఎంగా బీజేపీ అభ్య‌ర్థి కావాల‌ని క‌ల‌లు కంటున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు.

సీఎం గెహ్లాట్‌పై నెల రోజుల పాటు మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ అయిన త‌ర్వాత స‌చిన్ పైల‌ట్ మ‌ళ్లీ గెహ్లాట్ టీమ్‌తో క‌లిశారు. ఈ నేప‌థ్యంలో విశ్వాస ప‌రీక్ష కీల‌కంగా మారింది.


logo