ఆదివారం 29 మార్చి 2020
National - Feb 12, 2020 , 12:29:35

ట్రంప్ రాక ప్ర‌త్యేక‌మైంది : ప‌్ర‌ధాని మోదీ

ట్రంప్ రాక ప్ర‌త్యేక‌మైంది : ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే. ఈనెల 24, 25 తేదీల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. ట్రంప్‌ రాక అత్యంత ఆనందాన్ని క‌లిగిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.  ఆత్మీయ అతిథికి మ‌రిచిపోలేని స్వాగ‌తం ఏర్పాటు చేస్తామ‌ని మోదీ అన్నారు.  ట్రంప్ రాక ప్ర‌త్యేక‌మైంద‌ని,  భార‌త్‌, అమెరికా స్నేహ‌బంధాన్ని బ‌లోపేతం చేసేందుకు అది దోహ‌ద‌ప‌డుతుంద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యం, బ‌హుళ‌త్వం అంశంలో రెండు దేశాలు ఒకేవిధంగా క‌ట్టుబ‌డి ఉన్నాయ‌న్నారు. అనేక అంశాల్లో రెండు దేశాలు విస్తృత స్థాయిలో స‌హ‌కారం అంద‌జేసుకుంటున్నాయ‌న్నారు.  మ‌న స్నేహ‌బంధం వ‌ల్ల ప్ర‌పంచ దేశాల‌కు కూడా మంచి జ‌రుగుతుంద‌ని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  


logo