సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 09:41:56

సూర్యాస్త‌మయ వేళ‌.. తాజ్‌మ‌హ‌ల్‌లో ట్రంప్

సూర్యాస్త‌మయ వేళ‌.. తాజ్‌మ‌హ‌ల్‌లో ట్రంప్

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. సోమ‌వారం రోజున ఇండియా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆ రోజున తొలుత అహ్మాదాబాద్‌లో మొతెరా స్టేడియాన్ని ప్రారంభిస్తారు. ఆ త‌ర్వాత సాయంకాల వేళ ట్రంప్ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఆగ్రాలో ప‌ర్య‌టిస్తారు. సూర్యాస్త‌మ‌య స‌మ‌యంలో ట్రంప్‌.. పాల‌రాతి సుంద‌ర క‌ట్ట‌డం తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద గ‌డ‌ప‌నున్నారు. మ‌రోవైపు ఇండియా టూర్ ఫిక్స్ అయిన క్ష‌ణం నుంచి ట్రంప్ త‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌ర్నీ టెన్ష‌న్ పెడుతున్నారు.  వాణిజ్యంగా అమెరికాను భార‌త్ దెబ్బ‌తీసింద‌ని,  త‌న‌ను ఆహ్వానించేందుకు కోటి మంది వ‌స్తార‌ని.. ఇలా వెరైటీ కామెంట్ల‌తో త‌న టూర్‌ను ట్రంప్ ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా క‌శ్మీర్‌, పాక్ అంశాన్ని కూడా ప్ర‌స్తావిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.  మంగ‌ళ‌వారం రోజున ట్రంప్‌.. న్యూఢిల్లీలో బిజినెస్ మీటింగ్‌లు నిర్వ‌హిచ‌నున్నారు. మోదీ, ట్రంప్ మ‌ధ్య కొన్ని ఒప్పందాలు కుదిరే అవ‌కాశాలు ఉన్నాయి.  హార్లే డేవిడ్‌స‌న్ మోట‌ర్‌సైకిల్లు, డెయిర్ ప్రొడ‌క్ట్స్‌, పిజ్జా చీజ్ లాంటి వ‌స్తువుల‌పై డీల్ కుదుర్చుకోనున్నారు.  రెండు దేశాల మ‌ధ్య హెలికాప్ట‌ర్ల కోసం 2.4 బిలియ‌న్ల డాల‌ర్ల ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ది.  


logo