శనివారం 28 మార్చి 2020
National - Feb 25, 2020 , 13:00:36

హైద‌రాబాద్ హౌజ్‌లో ట్రంప్‌, మోదీ భేటీ

హైద‌రాబాద్ హౌజ్‌లో ట్రంప్‌, మోదీ భేటీ

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో ట్రంప్‌, మోదీలు భేటీ అయ్యారు.  ఇద్ద‌రూ ప‌లు అంశాలపై చ‌ర్చించుకున్నారు.  గ‌డిచిన కొన్ని రోజులు అద్భుతంగా సాగాయ‌ని ట్రంప్ అన్నారు. వాణిజ్యం, ర‌క్ష‌ణ ఒప్పందాల్లో జ‌రిగిన ప్ర‌గ‌తి గురించి మీడియాకు వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు.  మొతేరా స్టేడియంలో జ‌రిగిన ఈవెంట్‌ను గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని ట్రంప్ అన్నారు. మోదీ పేరు ప్ర‌స్తావించిన ప్ర‌తిసారి.. జ‌నం ఊగిపోయార‌న్నారు.  ప్ర‌ధాని మోదీ కూడా మాట్లాడారు.  ఓ ప్ర‌పంచాధినేత కోసం గ‌తంలో ఎన్న‌డూ భార‌త్‌లో ఇంత పెద్ద ఈవెంట్ జ‌ర‌గ‌లేద‌ని మోదీ అన్నారు. మీ కుటుంబంతో ఇండియాకు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఇక్క‌డ‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌ని మోదీ అన్నారు.


logo