శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 20:37:55

ట్విట్ట‌ర్‌పై మండిప‌డ్డ ట్రంప్‌!

ట్విట్ట‌ర్‌పై మండిప‌డ్డ ట్రంప్‌!

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉన్న‌ అంశాలన్నీ అబద్ధాలు, దొంగ వార్తలేనని ఆయ‌న‌ ఆరోపించారు. ట్విట్ట‌ర్ వార్త‌ల‌ను చూస్తుంటే త‌న‌కు చాలా చీద‌ర‌గా ఉంద‌ని పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ ట్రెండింగ్ మొత్తం త‌న‌పై దుష్ప్ర‌చారం గురించిన వార్త‌లే ఉంటున్నాయ‌ని ఆయన విమ‌ర్శంచారు. 

'ట్విట్టర్‌లో నాపై చాలా వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కటి కూడా మంచి వార్త కాదు. నాపై దుష్ప్రచారానికే ట్విట్టర్‌లో ప్రాముఖ్యత కనిపిస్తున్న‌ది' అని ట్రంప్ నిప్పులు చెరిగారు. అయితే ట్రంప్ ట్వీట్‌పై ట్విట్టర్ స్పందించింది. ట్రెండ్స్ అన్నీ ఓ అల్గారిథమ్ ప్రకారం డిసైడ్ అవుతాయ‌ని తెలిపింది. యూజర్ల లొకేషన్, ఫాలో అయ్యే వ్యక్తులు, అభిరుచులు మొద‌లైన వాటిని బట్టే ట్రెండ్స్ ఉంటాయని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo