గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 22:27:29

అమెరికాకు బయల్దేరిన ట్రంప్‌ దంపతులు..

అమెరికాకు బయల్దేరిన ట్రంప్‌ దంపతులు..

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తదితర ప్రముఖులంతా వారికి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ట్రంప్‌ కుటుంబ సభ్యులు కారులో నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సిద్దంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌-1లో వారు ఇండియా నుంచి అమెరికాకు బయల్దేరారు.


logo
>>>>>>