బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 20:05:16

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు..

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు..

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అతని భార్య, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారికి రాష్ట్రపతి భవన్‌ ప్రత్యేకతలు వివరించారు. యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ గౌరవార్థం.. రాష్ట్రపతి తేనీటి విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోది, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు హాజరవనున్నారు. 


logo
>>>>>>