శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 16:11:23

భార‌త్‌తో 3 బిలియ‌న్ డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం : డోనాల్డ్ ట్రంప్‌

భార‌త్‌తో 3 బిలియ‌న్ డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం :  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌:  అమెరికా వ‌ద్ద భార‌త్.. హెలికాప్ట‌ర్లు కొనుగోలు చేయ‌నున్న‌ది.  మూడు బిలియ‌న్ల డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం కుదుర్చుకోనున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.   ఇవాళ మొతేరా స్టేడియంలో మాట్లాడుతూ..  ఇండియాను అమెరికా ప్రేమిస్తోందని ట్రంప్ అన్నారు. భార‌త్‌ను అమెరికా ప్రేమిస్తుంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు మెలానియా, నేను 8వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి వ‌చ్చిన‌ట్లు ట్రంప్ చెప్పారు.  మొతేరా స్టేడియం అద్భుతంగా ఉంద‌న్నారు.  త‌న‌కు వెల్క‌మ్ ప‌లికిన తీరు ప‌ట్ల థ్యాంక్స్ చెప్పారు. ఈ ఆతిథ్యాన్ని త‌న కుటుంబం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి రోడ్ షోల‌ను చూడ‌లేద‌న్నారు. 

ప్ర‌ధాని మోదీ.. మీరు గుజ‌రాత్‌కు మాత్ర‌మే గ‌ర్వకార‌ణం కాదు అని,  క‌ఠోర శ్ర‌మ‌కు మీరు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తార‌ని మోదీని కొనియాడారు. ఈ న‌గ‌రంలోనే  టీ అమ్మిన వ్య‌క్తి.. ఈ దేశాన్ని ఏలుతున్న తీరు అద్భుతం అన్నారు.  భార‌త్ గురించి త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావిస్తూ.. బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా నృత్యాలు, క్లాసిక్ సినిమాలైన డీడీఎల్‌, షోలేల‌ను ఆయ‌న గుర్తు చేశారు. క్రికెట‌ర్లు స‌చిన్‌, విరాట్ కోహ్లీల‌ను భార‌తీయులు ఆద‌రిస్తున్న తీరును కూడా ట్రంప్ కొనియాడారు.  మోదీని ప్ర‌తి ఒక్క‌రూ ప్రేమిస్తార‌ని, కానీ ఆయ‌న చాలా ట‌ఫ్ వ్య‌క్తి అని ట్రంప్ అన్నారు. 


logo