గురువారం 21 జనవరి 2021
National - Jan 01, 2021 , 17:58:13

ట్రక్కును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

ట్రక్కును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

కట్నీ : మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 7పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రిషబ్‌ గుప్తా, కుశ్‌ గుప్తా, ప్రియాంక్‌ సుహానే, కారు డ్రైవర్‌ దశరథ యాదవ్‌గా గుర్తించారు. మృతులంతా కట్నీ జిల్లా కేంద్రానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుతలాతన పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి విపిన్‌ సింగ్‌ పేర్కొన్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo