శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 15:52:46

వలసకార్మికుడు మృతి..రోడ్డుపైనే ముగ్గురు కూతుళ్లు

 వలసకార్మికుడు మృతి..రోడ్డుపైనే ముగ్గురు కూతుళ్లు

మధ్యప్రదేశ్‌: అతడు యూపీకి చెందిన వలసకార్మికుడు. బతుకుదెరువు కోసం గతంలో ముంబైకి వచ్చి లాక్‌డౌన్‌తో ముంబైలో చిక్కుకున్నాడు. ఎలాగైనా యూపీలోని తన స్వస్థలమైన అజాంగఢ్‌కు చేరుకోవాలని ముగ్గురు కూతుళ్లను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ట్రక్కు దొరకడంతో తన ముగ్గురు కూతుళ్లతో కలిసి సదరు వలస కార్మికుడు సొంతూరుకు పయనమయ్యాడు.

అయితే దురదృష్టవశాత్తు వలసకార్మికుడు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ట్రక్కు  డ్రైవర్ మానవత్వం మరిచిపోయి..కార్మికుడి మృతదేహంతోపాటు అతని ముగ్గురు కూతుళ్లు (మైనర్లు)ను రోడ్డు పక్కనే వదిలిపెట్టిపోయాడు. ట్రక్కు డ్రైవర్‌ వలసకార్మికుడితోపాటు అతని ముగ్గురు కూతుళ్లను మధ్యప్రదేశ్‌ లోని శివ్‌ పురి జిల్లాలోని కరేరా రోడ్డు పక్కనే వదిలిపెట్టివెళ్లాడని కరేరా తహసీల్దార గౌరీ శంకర్‌ బైర్వా తెలిపారు. తండ్రి మృతదేహంతోపాటు ఆ ముగ్గురు కూతుళ్లను స్వస్థలానికి పంపించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo