బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 18:00:43

మృతిచెందిన వలసకూలీని, అతని పిల్లలను అర్ధాంతరంగా వదిలివెళ్లిన ట్రక్కు డ్రైవర్

మృతిచెందిన వలసకూలీని, అతని పిల్లలను అర్ధాంతరంగా వదిలివెళ్లిన ట్రక్కు డ్రైవర్

భోపాల్‌: కరోనా మహమ్మారి విస్తరించడం, దాని మూలంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం వలస కూలీల పాలిట శాపంగా మారింది. వలసపోయిన దగ్గర బతుకలేక, స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక వారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. కాలి నడకన, లారీల్లో, ట్రక్కుల్లో ఇలా ఏది దొరికితే ఆ వాహనంలో బయలుదేరుతున్నారు. అయితే వారి ప్రయాణాల్లో ఎన్నో హృదయ విధారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. ముంబైకి చెందిన వలసకూలీ పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామం అజంగఢ్‌కు ఓ ట్రక్కులో బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో మధ్యప్రదేశ్‌లోని కరేరా ప్రాంతానికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురై వలసకూలీ మృతిచెందాడు. దీంతో ట్రక్కు డ్రైవర్‌ అతని మృతదేహాన్ని, మైనర్లయిన అతని ముగ్గురు పిల్లలను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo