మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 15:31:56

బీజేపీ ఎంపీ అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎంపీల ఆగ్ర‌హం

బీజేపీ ఎంపీ అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎంపీల ఆగ్ర‌హం

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ర్ట ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర‌మైన ఆరోప‌ణ‌లు మాని, తెలంగాణ‌కు రావాల్సిన పెండింగ్ నిధులు వ‌చ్చేలా కృషి చేయాల‌ని అర‌వింద్‌కు టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు. తెలంగాణ‌కు రూ. 50 వేల కోట్లు ఇస్తే తిరిగిచ్చేది రూ. 23 వేల కోట్లే అని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. రాష్ర్టాల‌కు రావాల్సిన చాలా ఆదాయాల్లో కేంద్రం కోత‌లు పెట్టింద‌ని పేర్కొన్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు రూ. 290 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. జీఎస్టీ, వెనుక‌బ‌డిన జిల్లాల నిధులు రూ. 9 వేల కోట్లు ఇవ్వాలి అని రంజిత్ రెడ్డి చెప్పారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు అబ‌ద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఎంపీ వెంక‌టేశ్ నేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంపీ అర‌వింద్ స‌భ్య‌త‌, సంస్కారంతో మాట్లాడాల‌ని సూచించారు. రాష్ర్ట అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాల చ‌ర్చ త‌ర్వాతే రెవెన్యూ బిల్లు ఆమోదించిన విష‌యాన్ని గుర్తు చేశారు. వీగిపోతాయ‌నే మూజువాణి ఓటుతో వ్య‌వ‌సాయ బిల్లులను ఆమోదించార‌ని వెంక‌టేశ్ నేత పేర్కొన్నారు. 


logo