గురువారం 04 జూన్ 2020
National - Feb 04, 2020 , 15:28:16

గాంధీజీ గ్రామ‌స్వ‌రాజ్యాన్ని.. కేసీఆర్ నిజం చేస్తున్నారు : ఎంపీ నామా

గాంధీజీ గ్రామ‌స్వ‌రాజ్యాన్ని.. కేసీఆర్ నిజం చేస్తున్నారు : ఎంపీ నామా

హైద‌రాబాద్‌:  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు.  తెలంగాణ‌లో ప‌ల్లెల అభివృద్ధి కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు.  తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న ప‌ల్లె ప్ర‌గ‌తి యావ‌త్ దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు.  దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు గ‌డుస్తున్నా.. ఇంకా వేలాది గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేద‌న్నారు.  గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌న్నారు.  మిష‌న్ భ‌గీర‌థ ద్వారా గ‌త నాలుగేళ్ల నుంచి ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి ఇంటికి నీళ్లు అందిస్తున్నామ‌న్నారు.  భ‌గీర‌థ స్పూర్తితోనే కేంద్రం జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌ను ప్రారంభించింద‌న్నారు. గాంధీజీ క‌లలు క‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని కేసీఆర్ నిజం చేసి చూపించార‌న్నారు. రైతుల‌కు ప్ర‌తి ఎక‌రాకు ప‌దివేలు ఇస్తున్నామ‌న్నారు. రైతుబంధు స్పూర్తితోనే కేంద్రం కిసాన్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్రారంభించింద‌న్నారు. ప్ర‌తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. దేశం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. 


 


logo