బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 13:30:25

రేవంత్‌పై చర్యలు తీసుకోండి : ఎంపీ నామా

రేవంత్‌పై చర్యలు తీసుకోండి : ఎంపీ నామా

న్యూఢిల్లీ : మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. శంకర్‌పల్లి కానోజీగూడ వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాను ఎగురవేసినందుకు రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం విదితమే. ఈ విషయాన్ని ఎంపీ నామా లోక్‌సభలో ప్రస్తావించారు. ఎయిర్‌క్రాప్ట్‌ యాక్ట్‌ ప్రకారం రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని డిమాండ్‌ చేశారు. డ్రోన్‌ కెమెరాలతో ప్రైవసీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లుగప్పి రేవంత్‌ రెడ్డి డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణ చేశారని నామా పేర్కొన్నారు. 

ఈ కేసులో బెయిల్ కోసం ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్‌ వాడిన కేసులో రేవంత్‌ రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు.


logo