మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 10:40:22

ఆయుర్వేద బిల్లుపై మాట్లాడిన ఎంపీ కేశ‌వ‌రావు

ఆయుర్వేద బిల్లుపై మాట్లాడిన ఎంపీ కేశ‌వ‌రావు

హైద‌రాబాద్‌: రాజ్య‌స‌భ‌లో ఇవాళ ఆయుర్వేద బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. తెలంగాణ‌లో ఆయుర్వేద కాలేజీలు చాలా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. యునానీ, హోమియోప‌తి, సిద్ధ కాలేజీలు కూడా ఉన్న‌ట్లు తెలిపారు. సాంప్ర‌దాయ జ్ఞానంపై జ‌రుగుతున్న బోధ‌న‌, ప‌రిశోధ‌న‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు కేశ‌వ‌రావు తెలిపారు. ఆయుర్వేద విధానం మ‌న‌దేశానికి చెందిన‌ద‌న్నారు. ఆయుర్వేదం వేదాల‌కు సంబంధించిన‌ద‌ని, భౌతిక‌, శారీర‌క‌, మానసిక ప‌ద్ద‌తుల్లో చికిత్స వేల ఏళ్లుగా కొన‌సాగుతోంద‌న్నారు. ఆయుర్వేద వైద్యానికి ప్ర‌పంచ గుర్తింపు వ‌స్తోంద‌ని ఎంపీ తెలిపారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదో ప్ర‌ధాన వైద్య విధానంగా ప‌రిణితి చెందింద‌న్నారు. ఆయుర్వేద ఉత్ప‌త్తుల్లో వృద్ధి గ‌ణ‌నీయంగా ఉన్న‌ట్లు చెప్పారు. దేశంలో సుమారు 75 శాతం మంది ఆయుర్వేద ప్రొడ‌క్ట్స్‌ను వినియోగిస్తార‌న్నారు. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో ఆయుర్వేదంలో ప‌రిశోధ‌న కొన‌సాగాల‌ని టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు తెలిపారు.  


logo