బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 15, 2021 , 20:00:41

రిపబ్లిక్‌ టీవీ గోస్వామి జైలుకెళ్లాల్సిందే

రిపబ్లిక్‌ టీవీ గోస్వామి జైలుకెళ్లాల్సిందే

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి బ్రాడ్‌కాస్ట్‌ అడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) మాజీ సీఈఓ పార్థ్‌ దాస్‌ గుప్తా మధ్య సాగిన వాట్సాప్‌ చాటింగ్‌పై సీనియర్‌ అడ్వకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు లీకైన అర్నాబ్‌, పార్థ్‌ దాస్ గుప్తా చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లను శుక్రవారం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

ఈ చాటింగ్‌లో అర్నాబ్ గోస్వామి అసాధారణ రీతిలో ప్రభుత్వ పెద్దలను కలుసుకోవడంలో పలు కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. మీడియా అధినేతగా అర్నాబ్‌ గోస్వామి తనకు గల పలుకుబడిని పవర్ బ్రోకర్‌గా వాడుకున్నారని మండిపడ్డారు. దేశంలో ఏదైనా చట్టం అమలులో ఉంటే అర్నాబ్‌ గోస్వామి సుదీర్ఘకాలం జైలు పాలవ్వడం ఖాయం అని ట్వీట్‌ చేశారు. 

గత అక్టోబర్‌లో బార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీఆర్పీ రేటింగ్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. రిపబ్లిక్‌ టివీ తన టీఆర్పీ రేటింగ్‌ పెంచుకోవడంలో అవకతవకలకు పాల్పడిందని బార్క్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. 

ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు పార్థ్‌ దాస్‌గుప్తా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రిపబ్లిక్‌ టీవీని నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకురావడంలో టీఆర్‌పీ రేటింగ్స్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పోలీసుల అభియోగం. ఇందుకోసం దాస్‌గుప్తాకు గోస్వామి భారీగా ముడుపులు చెల్లించారని పోలీసులు తెలిపారు. 2017లో రిపబ్లిక్‌ టీవీ చానెల్ ప్రారంభమైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo