కేసులు తప్పించుకునేందుకే గాంధీలకు పార్టీ

లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి పట్టు సాధించాలని ప్రయత్నాలు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యూపీలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత పండిట్ వినోద్ మిశ్రా.. పార్టీ నేత ప్రియాంకగాంధీపై నిప్పులు చెరిగారు. బ్రహ్మణ మహాసభ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వినోద్ మిశ్రా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీనికి ప్రియాంకాగాంధీ ఆధిపత్య ధోరణి వల్లే తాను వైదొలిగినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల నుంచి తప్పించుకోవడానికి గాంధీ పరివార్.. కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నదని వినోద్ మిశ్రా ఆరోపించారు. సీనియర్ నేతలను అవమాన పరిచి, పార్టీ వీడేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన యూపీసీసీ అధ్యక్షుడిగా రాజ్‌బబ్బర్ హయాంలో లక్నో జిల్లా ఇన్చార్జిగా వ్యవహరించారు. దేశానికి స్వాతంత్య్రం కోసం జాతీయోద్యమ సారధిగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ.. దురదృష్టవశాత్తు ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని వామపక్ష నేతలకు అప్పగించిందని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్‌తో ఎన్నో లాభాలు..