శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Aug 19, 2020 , 17:41:18

ఇంటి పైక‌ప్పు ఎక్కి బంగారం, న‌గ‌దు ఎత్తుకెళ్లిన కోతులు.. పాపం మ‌హిళ‌!

ఇంటి పైక‌ప్పు ఎక్కి బంగారం, న‌గ‌దు ఎత్తుకెళ్లిన కోతులు.. పాపం మ‌హిళ‌!

కోతుల బృందం 70 ఏండ్ల జి శ‌ర‌తంబ‌ల్  అనే వృద్ధ మ‌హిళ ఇంటి మీద దాడి చేశాయి. ఆమె ఇంటి ముందు కూర్చొని బ‌ట్ట‌లు ఉతుకుతున్న‌ది. కోతుల‌కు ఎలా తెలుసో ఏమో మ‌రి ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవడంతో ఇంటి గుడిసె పైక‌ప్పు ఎక్కి కూర్చున్నాయి. ఇంట్లో బియ్యం, అర‌టిపండ్లు అన్నీ వ‌స్తువులు ఉన్నాయి. అలాగే బంగారు ఆభ‌ర‌ణాలు, రూ. 25 వేల న‌గ‌దు కూడా ఉంది. ఇదే అదునుగా కోతులు ఇంట్లోకి దూకి సామానుల‌న్నింటినీ గంద‌ర‌గోళం చేశాయి. ఈ సంఘటన తమిళనాడు తంజావూరు జిల్లా, తిరువయారు సమీపంలోని వీరమంగుడిలో చోటు చేసుకున్న‌ది.

తులు ఇంట్లో దూరాయ‌ని తెలియ‌గానే హుటాహుటిన వ‌చ్చి వాటిని త‌రిమారు స్థానికులు. లోప‌ల ఉండే ఆహార‌ప‌దార్థాలు తింటున్న వాటిని త‌ర‌మ‌డంతో న‌గ‌దు బ్యాగ్‌ను కూడా వెంట తీసుకెళ్లిపోయాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద శరతంబల్ తన పొదుపు నుంచి ఆభరణాలను కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు ఆదా చేసిందామె. కోతులు తరచూ గ్రామ వీధుల్లోకి ప్రవేశిస్తుండటంతో వాటిని పట్టుకొని అటవీ ప్రాంతాల్లో విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


logo