బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 17:12:49

అగ్రి చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ పిటిష‌న్

అగ్రి చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ పిటిష‌న్

 హైద‌రాబాద్‌: ఇటీవ‌ల కేంద్రం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ బిల్లుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బిల్లుల‌ను స‌వాల్ చేస్తూ కేర‌ళ‌లోని త్రిసూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తాప‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ స‌ర్వీసెస్ యాక్ట్ గురించి ఆయ‌న త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు.  ఆ చ‌ట్టానికి రాజ్యాంగ నిబద్ద‌త ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ చ‌ట్టం ఆర్టిక‌ల్ 14, 15, 21ల‌ను ఉల్లంఘిస్తున్న‌ట్లు త‌న పిటిష‌న్ ఎంపీ ప్ర‌తాప‌న్ ఆరోపించారు.  logo