మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 22:56:32

త్రిపురలో మరో మూడు రోజులు లాక్‌డౌన్‌

త్రిపురలో మరో మూడు రోజులు లాక్‌డౌన్‌

అగర్తలా : కరోనా వైరస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి మూడు రోజుల రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ శనివారం తెలిపారు. లాక్‌డౌన్‌ జూలై 27 ఉదయం 5గంటలకు ప్రారంభమై 30 ఉదయం 5గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్‌లో 20 మినహాయంపులు ఉంటాయి. తాజా నివేదిక ప్రకారం.. త్రిపురలో మొత్తం 3,778 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,131 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 11 మంది మరణించారు.

మాస్క్‌ ధరించని, సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్‌లు ధరించకుండా కనిపిస్తే మొదటిసారి రూ.200, రెండోసారి రూ.400 జరిమానా, సామాజిక దూరం ఉత్తర్వులు ఉల్లంఘించిన రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  కాగా, కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇంటింటికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు వారం రోజుల పాటు సర్వేలో పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo