గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 14:20:49

లాక్‌డౌన్ విధించి.. ఇంటింటి క‌రోనా స‌ర్వే

లాక్‌డౌన్ విధించి.. ఇంటింటి క‌రోనా స‌ర్వే

అగర్తలా: ఈశాన్యంలోని త్రిపుర రాష్ట్రంలో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్న‌ది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ను విధించారు. మ‌రోవైపు అదే స‌మ‌యంలో ఇంటింటి క‌రోనా స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. ఆరోగ్య‌శాఖ, పంచాయ‌తీ సిబ్బంది ప్ర‌తి ఇంటికి వెళ్లి ప్ర‌జ‌ల ఆరోగ్య వివ‌రాలు సేక‌రిస్తున్నారు. త్రిపుర‌లో క‌రోనా కేసుల సంఖ్య 3,900కి చేర‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది మ‌ర‌ణించారు.logo