బుధవారం 03 మార్చి 2021
National - Jan 17, 2021 , 15:22:58

త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?

త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌పై బీజేపీ మద్దతుదారుల దాడి ?

అగర్తలా : త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పిజుష్‌ బిశ్వా కారుపై అధికార బీజేపీ మద్ధతుదారులు ఆదివారం ఉదయం దాడికి పాల్పడ్డట్లుగా సమాచారం. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ దాడిలో బిశ్వా స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర రాజధాని నగరం అగర్తలకు 20 కిలోమీటర్ల దూరంలోని బిశాల్‌గర్‌ కాంగ్రెస్‌ కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో కారు ముందుభాగం అద్దాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

గడిచిన శుక్రవారం బిశ్వా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను నిర్వహించారు. స్థానిక మహాత్మగాంధీ విగ్రహం నుండి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీని చేపట్టారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలో మృతిచెందిన రైతులకు సంతాపంగా గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా పథకం ప్రకారమే సీపీఐ(ఎం) కార్యకర్తలపై బీజేపీ దాడికి పాల్పడిందని త్రిపుర ప్రతిపక్ష నాయకుడు మాణిక్ సర్కార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి నబెందు భట్టాచార్య తోసిపుచ్చారు.

VIDEOS

logo