గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 17:31:24

ఎయిర్‌పోర్టులో రూ.20 లక్షల విలువైన గోల్డ్‌..

ఎయిర్‌పోర్టులో రూ.20 లక్షల విలువైన గోల్డ్‌..

సూరత్‌: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని సూరత్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానంలో వచ్చిన గణేశ్‌ వలోద్రా అనే వ్యక్తి బ్యాగును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న సూట్‌కేసు కవర్‌లో 500 గ్రాముల బంగారు రేకులు దాచినట్లు గుర్తించి..సీజ్‌ చేశారు. మార్కెట్‌లో బంగారం విలువ సుమారు రూ.20 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. ముంబై నుంచి వచ్చిన  గణేశ్‌ వలోద్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


logo