బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 16:37:50

ప‌శువుల కాప‌లాకి వెళ్లి.. పెద్ద బండ‌రాళ్ల మ‌ధ్య‌లో ఇరుక్కున బాలుడు!

ప‌శువుల కాప‌లాకి వెళ్లి.. పెద్ద బండ‌రాళ్ల మ‌ధ్య‌లో ఇరుక్కున బాలుడు!

ప్ర‌మాద సంఘ‌ట‌న‌లు ఎప్పుడు, ఎక్క‌డ, ఎలా జ‌రుగుతాయో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప‌శువుల కాప‌లాకి వెళ్లిన బాలుడు అస‌లు రాళ్ల సందులో ఇరుక్కోవ‌డం ఏంటి? అలా రాసి పెట్టిన‌ట్టు ఉంది. త‌మిళ‌నాడుకు చెందిన బాలుడు బండ‌రాళ్ల‌పై కూర్చొని ఫోన్‌లో వీడియోలు చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నాడు. ఒక్క‌సారిగా ఫోన్ జారి రాళ్ల మ‌ధ్య‌లో ప‌డింది. దానిని తీసేందుకు ఆ రాళ్ల‌ను కాస్త అటూ ఇటూ జ‌రిపాడు. అంతే.. పైనున్న‌ రాళ్ల‌న్ని ఒక్కొక్క‌టిగా 12 ఏండ్ల బాలుడిపై ప‌డ్డాయి.

ఆ నొప్పి భ‌రించ‌లేక పెద్ద పెద్ద కేక‌లు వేయసాగాడు. అత‌డి అరుపులు ప‌సిగ‌ట్టిన స్థానికులు అత‌నిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం అంద‌జేశారు. అగ్నిమాప‌క సిబ్బందితో పోలీసులు అక్క‌డికి చేరుకొని పెద్ద‌ బండ‌రాళ్ల‌ను తాళ్ల‌తో క‌ట్టి ప‌క్క‌కి లాగారు. గంట‌పాటు చాలా క‌ష్టంగా బాలుడిని బ‌య‌టికి తీసి ప్రాణాల‌తో కాపాడారు. కాబ‌ట్టి ప్ర‌తీచోట అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
logo