బుధవారం 08 జూలై 2020
National - Jun 28, 2020 , 18:25:06

జీవనోపాధి కష్టమవుతోంది : ట్రాన్స్‌ వుమన్‌ బెల్లా

జీవనోపాధి కష్టమవుతోంది : ట్రాన్స్‌ వుమన్‌ బెల్లా

చండీఘర్‌ : లాక్‌డౌన్‌ తర్వాత జీవనోపాధికి కష్టమవుతోందని ట్రాన్స్‌ వుమన్‌ బెల్లా పేర్కొన్నారు. చండీఘర్‌లో ఆదివారం మాట్లాడుతూ పంచకులలో లాక్‌డౌన్‌కు ముందు ఓ క్యాబ్‌ కంపెనీలో కస్టమర్‌ కేర్‌ రిప్రజంటేటివ్‌గా పని చేశానని, అనంతరం కంపెనీ మూసివేయడంతో మరో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపింది. 22 నుంచి 30 చోట్ల ఉద్యోగం ప్రయత్నిస్తే ఎక్కడా ప్రయోజనం లేకపోయిందని, ట్రాన్స్‌జెండర్లను ఎవరూ ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆఫీసుకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌జెండర్‌ అని తిరస్కరిస్తున్నారని బెల్లా పేర్కొన్నారు.

ట్రాన్స్ పర్సన్లను ప్రజలు గౌరవించరని, నిత్యం అవమానాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. మన సమాజంలో ట్రాన్స్‌పర్సన్‌గా బతకడం కష్టమని, నాకు ఏడు సంవత్సరాల పని అనుభవం ఉందనీ, అయినా ఒక్క ఉద్యోగం వెతుక్కోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో విధించిన లాక్‌డౌన్‌లో తన సహోద్యోగులు కూడా ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని తెలిపింది. నేను నా స్వంత కమ్యూనిటీ (డేరా) నుంచి సహాయం పోందానని, లాక్‌డౌన్ సమయంలో మాకు రేషన్ అందించాని, ప్రస్తుతం ఉద్యోగం అవసరం ఆమె ఉందని చెప్పింది.


logo