సోమవారం 30 నవంబర్ 2020
National - Sep 25, 2020 , 16:50:19

రవాణాశాఖ మంత్రికి కరోనా

రవాణాశాఖ మంత్రికి కరోనా

కోల్‌కతా : కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్‌ బారినపడగా.. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రవాణాశాఖ మంతి సువేందు అధికారి కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఆయన తల్లికి కూడా వైరస్‌ సోకిందని పేర్కొన్నారు. పుర్బా మదీనిపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌కు చెందిన 49 ఏళ్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని గెస్ట్‌హౌస్‌లో గృహనిర్భందంలో ఉండగా.. ఆయన తల్లిని కోల్‌కతాలోని దవాఖానలో చేర్పించినట్లు సదరు అధికారి తెలిపారు. ఇంతకు ముందు బెంగాల్‌లో మంత్రులు సుజిత్‌ బోస్‌, జ్యోతిప్రియో ముల్లిక్‌, స్వాపన్‌ దేబ్నాథ్‌ మహమ్మారి బారినపడగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా బెంగాల్‌లో గురువారం నాటికి 2.37లక్షల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 25,221 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2,08,042 మంది డిశ్చార్జి కాగా.. వైరస్‌ ప్రభావంతో 4,606 మంది మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.