గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:57:09

పారదర్శకంగా కరోనా పరీక్షలు..చంద్రబాబు విమర్శలు అర్థరహితం

పారదర్శకంగా కరోనా పరీక్షలు..చంద్రబాబు విమర్శలు అర్థరహితం

అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనాపై ఏర్పాటు చేసిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా ఏపీ ఉందని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని వివరించారు. ప్రైవేట్ దవాఖానలు వైద్యానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

అత్యంత పారదర్శకంగా కరోనా పరీక్షలు చేస్తుంటే.. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడం సరిదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడ కూడా డాక్టర్ల కొరత లేదని తెలిపారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోనే పరిష్కరించామని వివరించారు. జిల్లాలో 2 కోవిడ్ సెంటర్లకు అదనంగా మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. కొవిడ్ మరణాలు కూడా దాచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి ఆళ్లనాని తెలిపారు.logo