శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 16:49:07

కరోనాపై భయం వద్దంటున్న హిజ్రాలు

కరోనాపై భయం వద్దంటున్న హిజ్రాలు

చెన్నై: కరోనాపై భయాందోళన చెందవద్దని హిజ్రాలు చెబుతున్నారు. తమిళనాడులో శనివారం కరోనాపై అవగాహన కల్పించారు. కరోనాపై భయాన్ని దూరంగా ఉంచాలంటూ చెన్నైలోని తోండియార్‌పేట, నేతాజీ నగర్ మార్కెట్ ప్రాంతాల్లో చెన్నై కార్పొరేషన్ వాలంటీర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే ఫ్లకార్డులను ప్రదర్శించారు.

కరోనా గురించి భయాందోళన చెందవద్దని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఈ మహమ్మారిని తరిమిగొడదామంటూ హిజ్రాలు నినాదాలు చేశారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1.27 లక్షలకు చేరగా ఇప్పటి వరకు 1,765 మంది చనిపోయారు.


logo