సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 07:26:28

సుశాంత్‌ మృతి ‘పాట్నా’ కేసును ముంబైకి బదిలీ చేయండి

సుశాంత్‌ మృతి ‘పాట్నా’ కేసును ముంబైకి బదిలీ చేయండి

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై బీహార్‌ రాజధాని పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ బాలీవుడ్‌ కథానాయిక రియా చక్రవర్తి బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రియా చక్రవర్తి తదితరుల వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌.. పాట్నాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు ఈ కేసుపై పాట్నా పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించారు. కేసు దర్యాప్తు కోసం బీహార్‌ పోలీసుల బృందం ముంబైకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో రియాచక్రవర్తి పిటిషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo