శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 11:56:13

వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి : మమతా బెనర్జీ

వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి : మమతా బెనర్జీ

కోల్‌కతా : ఒక్కో వలస కార్మికుడి ఖాతాలో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బుధవారం ట్విట్టర్‌ ద్వారా మమతా బెనర్జీ స్పందిస్తూ... లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక ఉపశమన చర్యల్లో భాగంగా వలస కార్మికులకు, అసంఘటితరంగంలో పనిచేసే కార్మికులకు ఏకమొత్త సహాయంగా వారి అకౌంట్‌లో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను పీఎం కేర్స్‌లో కొంత భాగాన్ని కేటాయించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు.


logo