సోమవారం 18 జనవరి 2021
National - Dec 25, 2020 , 01:38:10

డ్రైవర్‌ లేకుండానే రైలు

డ్రైవర్‌ లేకుండానే రైలు

న్యూఢిల్లీ: డ్రైవర్‌తో పనిలేకుండా దానంతట అదే నడిచే అత్యాధునిక మెట్రో రైలు ఈ నెల 28న ఢిల్లీలో ప్రారంభం కానున్నది. ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌లో భాగమైన మెజెంటా లైన్‌లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు. డ్రైవర్‌ లేకుండా నడిచే రైలు దేశంలో ఇదే మొదటిది. జనక్‌పురి వెస్ట్‌ - బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలులో పలు  ప్రత్యేకతలున్నాయని డీఎంఆర్సీ అధికారులు గురువారం తెలిపారు.