శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 14:20:33

16 మంది రైలు ప్ర‌మాద మృతులు రైలు పాస్ కోసం అప్లై చేశారు

16 మంది రైలు ప్ర‌మాద మృతులు రైలు పాస్ కోసం అప్లై చేశారు

భోపాల్‌: మ‌హారాష్ట్రాలోని ఔరంగాబాద్ జిల్లాలో గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వ‌ల‌స కూలీలు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. 16 మంది వ‌ల‌స కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డానికి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్  ప్ర‌భుత్వానికి రైలు పాస్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రైలు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వారంతా 15 రోజుల క్రిత‌మే ద‌ర‌ఖాస్తున్న చేసుకున్నార‌ని ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉమారియా, షాడోల్‌, మాండ్ల జిల్లాల‌కు చెందిన ఈ కార్మికులు ప‌క్షం రోజుల క్రితం అప్లికేష‌న్ పెట్టుకుంటే అది ఎందుకు ప‌రిష్కారం కాలేదో దానిపై ద‌ర్యాప్త చేయాల‌ని ట్విట్ట‌ర్‌లో డిమాండ్ చేశారు. 

జాల్నాలోని స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్న కూలీలు న‌డిచి సొంత‌రాష్ట్రాల‌కు బ‌య‌లుదేరారు. క‌ర్మ‌ద్ వ‌ర‌కు వ‌చ్చిన త‌రువాత అలిసిపోయి ప‌ట్టాల‌పై ప‌డుకున్నారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన న‌లుగురు ప‌ట్టాల‌కు కొంత‌దూరంలో నిద్రిస్తున్నారు. రోడ్ల‌పై న‌డుచుకుంటూ వెళుతున్న వ‌ల‌స కార్మికుల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో రైలు ప‌ట్టాల వెంబ‌డి న‌డిచామ‌ని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ బాధితులు తెలిపారు. 


logo