మంగళవారం 26 మే 2020
National - May 11, 2020 , 17:21:01

ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌..ట్రాఫిక్‌ జామ్‌

ఐఆర్‌సీటీసీ  ఆన్‌లైన్‌ బుకింగ్‌..ట్రాఫిక్‌ జామ్‌

న్యూఢిల్లీ:  ప్యాసింజర్‌ రైళ్లు మంగళవారం నుంచి పట్టాలెక్కనున్న నేపథ్యంలో  ప్రయాణికుల రైళ్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకావాల్సి ఉంది. ఐతే ప్రయాణికులంతా టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయడంతో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. ఒకేసారి చాలామంది ఓపెన్‌ చేయడంతో వెబ్‌సైట్‌ స్లోగా పనిచేస్తోంది.  

ప్రస్తుతం డేటా అప్‌లోడ్‌ అవుతోందని  సాయంత్రం 6 గంటల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రారంభిస్తామని ఐఆర్‌సీటీసీ  ఒక ప్రకటనలో తెలిపింది.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్ల బుకింగ్‌ చేసుకోవాలని సూచించింది. రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో టిక్కెట్ల జారీ ఉండదని స్పష్టం చేసింది. logo