శనివారం 29 ఫిబ్రవరి 2020
రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి

రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి

Feb 14, 2020 , 15:12:42
PRINT
రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి

ముంబయి : రైల్లో సీటు కోసం జరిగిన గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన సాగర్‌ మార్కాండ్‌(26), అతని భార్య జ్యోతి, రెండేళ్ల కూతురు.. ముంబయి - బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి ప్రయాణిస్తున్నారు. బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కల్యాణ్‌ నుంచి సోలాపూర్‌ జిల్లాలోని కుర్దువాడికి బయల్దేరారు. జనరల్‌ బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో.. ఓ మహిళా ప్రయాణికురాలిని మార్కాండ్‌ సీటు అడిగాడు. తన భార్య, పాప కూర్చునేందుకు కొంచెం సీటు ఇవ్వండని అడగడంతో.. ఆమె అసభ్యపదజాలంతో దూషించింది. ఈ క్రమంలో మార్కాండ్‌, ఆమె మధ్య గొడవ చోటు చేసుకుంది. ప్రయాణికురాలికి మద్దతుగా సుమారు 12 మంది కలిసి మార్కాండ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తన భర్తను కొట్టొద్దని జ్యోతి వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు. పుణె స్టేషన్‌కు రాగానే జ్యోతి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు మహిళతో పాటు మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మార్కాండ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


logo