బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 20:32:27

బోగీలను మద్యలో మరిచిన శ్రామిక్‌ రైలింజన్‌

బోగీలను మద్యలో మరిచిన శ్రామిక్‌ రైలింజన్‌

గుజరాత్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ వెళుతున్న శ్రామిక్‌ రైలు ఇంజిన్‌ ఏకంగా 20 బోగీలను మరిచిపోయి వెళ్ళిపోయింది. ఇతర రాష్ర్టాలకు చెందిన శ్రామికులను తీసుకుని వెళ్ళేందుకు రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైలు శ్రామిక్‌ రైలు ఒకటి ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో 1200 మంది కార్మికులతో ప్రారంభమైన 23 బోగీల రైలు ఉత్తరప్రదేశ్‌లోని గమ్య స్థానానికి చేరుకోక ముందే ఈ రోజు ఉదయం 7 గంటలకు 20 బోగీలను మద్యలో ఓ స్టేషన్‌ దగ్గర్లో వదిలేసి వెళ్ళిపోయింది. రైలు ఎంతసేపటికీ కదలడం లేదనుకున్న ప్రయాణికులు చాలా మందికి ఫోన్‌లు చేసారు. విషయం తెలుసుకున్న రైల్వే గార్డ్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెనకకు వచ్చిన ఇంజిన్‌ 11 గంటలకు తిరిగి బోగీలను తీసుకుని వెళ్ళింది. 


logo