సోమవారం 01 మార్చి 2021
National - Jan 17, 2021 , 07:27:44

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ డే పరేడ్‌ రిహార్సరల్స్‌ కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నుంచి ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి 21వ తేదీ వరకు విజయ్‌ చౌక్‌ నుంచి ‘సీ’ హెక్సాగన్‌ వరకు రిహార్సల్స్‌ జరుగుతాయని పేర్కొన్నారు. ఇండియా గేట్‌-రాజ్‌పథ్‌ మధ్య కవాతుకు ఇబ్బందులు లేకుండా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రఫీ మార్గ్‌, జన్‌పథ్‌, మాన్‌సింగ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే విజయ్‌చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు రాజ్‌పథ్‌ మార్గం మూసివేయబడుతుందని చెప్పారు. ట్రాఫిక్‌ మళ్లింపుతో రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉందని, వాహనదారులు సమయంతో ఉండాలని, ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని కోరారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సైతం తమ ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. 

నార్త్‌ నుంచి సౌత్‌ కారిడార్‌ వరకు ప్రయాణించే ప్రయాణికులు రింగ్‌ రోడ్‌, ఆశ్రమం చౌక్‌, సారాయ్‌ కాలేఖాన్‌, ఐపీ ఫ్లైఓవర్‌, రాజ్‌ఘాట్‌, లజ్‌పత్‌ రాయ్‌ మార్గ్‌, మధుర రోడ్‌, బైరోన్‌ రోడ్‌, అరబిందో మార్గ్‌, సఫ్దర్‌జంగ్‌ రోడ్‌, మదర్‌ థెరిసా క్రెసెంట్‌, బాబా ఖరక్‌ సింగ్‌ మార్గ్‌, ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ కారిడార్‌ వరకు వాహనదారులు రింగ్‌ రోడ్‌, భైరోన్‌ రోడ్‌, మధుర రోడ్‌, లోధి మార్గ్‌, కమల్‌ అటతుర్క్‌ మార్గ్‌, సఫ్దర్‌జంగ్‌ రోడ్‌, ఐపీ కాలేజీ ద్వారా చాడ్గి రామ్ అఖారా, ఆజాద్పూర్, పంజాబీ బాగ్ మీదుగా మాల్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈస్‌ నుంచి సౌత్‌ఈస్ట్‌ వెళ్లే ప్రయాణికులు వందే మాతరం మార్గ్‌ ద్వారా రింగ్‌ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. సౌత్ అవెన్యూలోని వారంతా షికో రోడ్‌, హుక్మిమాయి రోడ్‌ -సౌత్‌ సుంకెన్‌ మార్గ్‌ ద్వారా ఆర్‌పీ భవన్‌ ద్వారా నార్త్ , సౌత్ బ్లాక్ చేరుకోవచ్చని తెలిపారు.

నార్త్ అవెన్యూ నుంచి, వాహనదారులు బ్రాస్సీ అవెన్యూను నార్త్ సుంకెన్ రోడ్ మీదుగా ఆర్‌పీ భవన్ ద్వారా నార్త్ , సౌత్ బ్లాక్ చేరుకోవచ్చని చెప్పారు. వినయ్‌ మార్గ్‌, శాంతిపాత్‌, న్యూఢిల్లీ నుంచి వెలుపలికి వెళ్లే వాహనదారులు సర్ధార్‌పటేల్‌ మార్గ్‌, మదర్‌ థెరిసా క్రెసెంట్‌, రౌండ్‌ అబౌట్‌, బాబా ఖరక్‌ సింగ్‌ మార్గ్‌, పార్క్‌ స్ట్రీట్‌, మందిర్‌ మార్గ్‌ మీదుగా నార్త్‌ ఢిల్లీ వైపు వెళ్లాలని సూచించారు. కేంద్ర సచివాలయం దక్షిణ వైపు నుంచి విశ్వ యువక్‌ కేంద్రం, చాణక్యపురి, త్యాగరాజ్‌ మార్గ్‌, కృష్ణ మీనన్‌ మార్గ్‌, మౌలానా ఆజాద్‌ రోడ్‌లో బస్‌ల రాకపోకలు తగ్గించనున్నట్లు చెప్పారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లే బస్సులు సర్దార్ పటేల్ మార్గ్, సైమన్ బోలివర్ మార్గ్, అప్పర్ రిడ్జ్ రోడ్, శంకర్ రోడ్, పార్క్ స్ట్రీట్, మందిర్ మార్గ్ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.

VIDEOS

logo