సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 08:43:45

పైనాపిల్ కేజీ 3 రూపాయ‌లే అంటున్నారు..

పైనాపిల్ కేజీ 3 రూపాయ‌లే అంటున్నారు..

ప‌శ్చిమ‌బెంగాల్‌: లాక్ డౌన్ ప్ర‌భావంతో ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమితం కావ‌డం, ర‌వాణా స్తంభించ‌డంతో అమ్మ‌కాలు నిలిచిపోయి ప‌శ్చిమ‌బెంగాల్ లో పైనాపిల్ (అన‌స‌)రైతులు తీవ్ర న‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. సిరిగురిలో పైనాపిల్ రైతు ఎండీ అల‌మ్ మాట్లాడుతూ..ప్ర‌స్తుతం వాహ‌నాలు నిలిచిపోయాయి. కూలీలు ఎవ‌రూ ప‌నికి వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. చేతికొచ్చిన‌ పైనాపిల్ ను తెంపి మార్కెట్ లోకి తీసుకుపోయే ప‌రిస్థితి లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాము పండించిన పంట‌ను దేశ‌వ్యాప్తంగా స‌రఫ‌రా చేయ‌డంతోపాటు నేపాల్ కు కూడా ఎగుమ‌తి చేస్తుంటామ‌న్నాడు.

గ‌తంలో పైనాపిల్ కిలోకు రూ.20 నుంచి 25 వ‌ర‌కు ప‌లికితే..వ్యాపారులు ప్ర‌స్తుతం కిలో 3-4 రూపాయ‌లకు మాత్ర‌మే కొనుగోలు చేస్తామంటున్నారు. నేను పైనాపిల్ తోట కోసం 3ల‌క్ష‌లు రుణం తీసుకున్నా. లాక్ డౌన్ ప్ర‌భావంతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన త‌మ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు మాఫీ చేయాల‌ని కోరాడు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo