బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 14:52:58

పటాకులు కాల్చిన వారిని పట్టుకునేందుకు జీపీఎస్‌ డివైజ్‌

పటాకులు కాల్చిన వారిని పట్టుకునేందుకు జీపీఎస్‌ డివైజ్‌

కోల్‌కతా : కాళీమాత పూజ సందర్భంగా ఫైర్‌ క్రాకర్స్‌పై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే వ్యక్తులను గుర్తించడానికి పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యూబీపీసీబీ) రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్‌ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేస్తోంది.  దీపావళి సందర్భంగా బాణాసంచ విక్రయాలు, కాల్చడంపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పటాకులు కాల్చే వారిని గుర్తించేందుకు డివైజ్‌లు సహాయపడతాయని పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కళ్యాణ్‌ రుద్ర బుధవారం తెలిపారు.


డివైజ్‌ బాణాసంచ పేలుడు ప్రదేశం, తేదీ, సమయాన్ని చూపుతుందని తెలిపారు. వివరాలన్నీ థర్మల్ ప్రింటర్ ద్వారా ఆధారాలను ప్రాసిక్యూషన్ కోసం ప్రింట్‌ తీసుకోవచ్చని చెప్పారు. డివైజ్‌లపై పోలీసులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. కాల్యుష్య నియంత్రణ మండలి బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేస్తుందని, అవసరమైతే సహాయం అందజేస్తుందని కళ్యాణ్‌ రుద్ర చెప్పారు. పండుగ సందర్భంగా లౌడ్‌ స్పీకర్ల నుంచి డెసిబెల్‌ స్థాయిని రికార్డు చేయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కొత్త పరికరాలు ఉపయోగపడుతాయని వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.