మంగళవారం 19 జనవరి 2021
National - Jan 10, 2021 , 13:19:54

య‌మునా న‌దిపై విష‌పు నుర‌గ‌లు!

య‌మునా న‌దిపై విష‌పు నుర‌గ‌లు!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో య‌మునా న‌ది కాలుష్య కాసారంగా మారింది. న‌గ‌రంలోని వివిధ ప‌రిశ్ర‌మ‌లు వ్య‌ర్థాల‌ను య‌మునా న‌దిలోకే వ‌దులుతుండ‌టంతో ఆ నదిలోని నీరు పూర్తిగా క‌లుషిత‌మై పోతున్న‌ది. న‌దిలోని చేప‌లు, ఇత‌ర జీవులు మృత్యువాత ప‌డుతున్నాయి. రోజూ న‌దిలో చేరుతున్న ర‌సాయ‌న వ్య‌ర్థాల కార‌ణంగా నీరు విష‌తుల్యంగా మారిపోతున్న‌ది. వ్య‌ర్థాల చేరిక అంత‌కంత‌కే పెరిగిపోతుండంతో నీటి ఉప‌రిత‌లంపై తెల్ల‌టి విష‌పు నుర‌గ‌లు పేరుకుపోతున్నాయి. ఢిల్లీలోని క‌లింద్ కుంజ్ ఏరియాలో యుమునా న‌దిపై పేరుకున్న విష‌పు నుర‌గ‌ల‌కు సంబంధించిన దృశ్యాల‌ను కింది చిత్రాల్లో చూడ‌వ‌చ్చు.  ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.