ఆదివారం 29 మార్చి 2020
National - Mar 21, 2020 , 20:42:04

మార్చి 31 వరకు పర్యాటకులు గోవాకు రాకూడదు..

మార్చి 31 వరకు పర్యాటకులు గోవాకు రాకూడదు..

పనాజి: గోవా.. దేశంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ముందు వరుసలో ఉంటుంది. బీచ్‌, అందమైనా భవనాలు, రెస్టారెంట్లు, మసాజ్‌ సెంటర్లు, బోట్‌ రైడింగ్‌, బికినీలతో విదేశీ భామలు, రకరకాలు వంటకాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా, మార్చి 31 వరకు గోవా బీచ్‌కు పర్యాటకులు రాకూడదని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌ మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రభుత్వం విధించిన గడువు వరకు బీచ్‌లు, రెస్టారెంట్లు, పౌరులు తిరిగే అందమైన ప్రదేశాలన్నీ మూతపడనున్నట్లు ఆయన వివరించారు. 

ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ, వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనా వైరస్‌ కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. దేశంలోనూ రోజురోజుకు కరోనా ప్రభావం తీవ్రమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని ఆయన వివరించారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటించాలనీ, ప్రధాని పిలుపు ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. దీంతో, వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని సీఎం సావంత్‌ తెలిపారు. గోవా బీచ్‌కు దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా పర్యాటకులు తరలి వస్తారన్న విషయం తెలిసిందే. 


logo