మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 12:06:22

మహారాష్ట్రలో 9566 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో 9566 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. పోలీస్‌శాఖలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరగడం  ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే  ఇప్పటి వరకు  9,566 మంది పోలీసులకు కరోనా సోకింది.  ఇందులో 988 అధికారులు, 8578 పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా వైరస్ కార‌ణంగా    పోలీసు విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది మృతిచెందారు. 

ప్రస్తుతం పోలీస్‌ శాఖలోనే 1929 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 7534 మంది కోలుకున్నారు.  కరోనా వల్ల 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.  మార్చి 22 నుంచి కరోనా వైరస్‌ నిబంధనలు, మార్గదర్శకాలు ఉల్లంఘించిన  2,19,975 మందిపై కేసులు నమోదు చేసినట్లు  పోలీస్‌ శాఖ వెల్లడించింది.  పోలీసులపై దాడి కేసుల్లో 883 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.


logo