బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 11:18:10

భారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు.. 17 మంది మృతి

భారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు.. 17 మంది మృతి

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 66 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. కేరళలో అత్యధికంగా 137, మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 55, రాజస్థాన్‌లో 45, తెలంగాణలో 45, గుజరాత్‌లో 44, ఉత్తరప్రదేశ్‌లో 42, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 33, హర్యానాలో 32, తమిళనాడులో 29, మధ్యప్రదేశ్‌లో 20, జమ్మూకశ్మీర్‌లో 14, లడఖ్‌లో 13, ఆంధ్రప్రదేశ్‌లో 11, పశ్చిమ బెంగాల్‌లో 10, బీహార్‌లో 9, చండీఘర్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 2, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు నమోదైంది.


logo