ఆదివారం 07 జూన్ 2020
National - Mar 29, 2020 , 19:46:47

మహారాష్ట్రలో 200 దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో 200 దాటిన కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 22 పాజిటివ్‌ కేసులు(ముంబై 10, పుణె 5, నాగ్‌పుర్‌ 3, అహ్మద్‌ నగర్‌ 2, సాంగ్లీ 1, బుల్దానా 1, జల్గావ్‌ 1) నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 203కు చేరుకుంది.  ఇవాళ్టి వరకు 35 మంది పేషెంట్లు  కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  కరోనా కారణంగా ఆదివారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటి వరకు కోవిడ్‌-19తో మరణించిన వారి సంఖ్య 8కు చేరింది.  ఇవాళ చనిపోయిన ఇద్దరికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు అధికారులు తెలిపారు. 


logo