గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 12:12:32

క‌రోనా వ‌ల్ల ప‌శ్చిమ రైల్వేకు రూ.1,905 కోట్ల న‌ష్టం

క‌రోనా వ‌ల్ల ప‌శ్చిమ రైల్వేకు రూ.1,905 కోట్ల న‌ష్టం

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప‌శ్చిమ రైల్వేకు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1,905 కోట్ల‌కుపైగా న‌ష్టం వాటిల్లింది. స‌బ్ అర్బ‌న్ సెక్ష‌న్ నుంచి రూ. 282.50 కోట్లు, నాన్ స‌బ్ అర్బ‌న్ సెక్ష‌న్ నుంచి సుమారు రూ.1622.50 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయిన‌ట్లు ప‌శ్చిమ రైల్వే తెలిపింది. జూలై  ఆరంభం నాటికి రూ.1,595 కోట్ల ఆదాయాన్ని ప‌శ్చిమ రైల్వే కోల్పోగా మూడు వారాల్లో సుమారు రూ.400 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింది. క‌రోనా నేప‌థ్యంలో ప్యాసింజ‌రు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు న‌డ‌వ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని ప్ర‌త్యేక రైళ్లు, గూడ్సు రైళ్లు మాత్రం న‌డుస్తున్నాయి.  తాజావార్తలు


logo