శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 20:10:22

షిల్లాంగ్‌లో 4 రోజులు కంప్లీట్ లాక్‌డౌన్‌

షిల్లాంగ్‌లో 4 రోజులు కంప్లీట్ లాక్‌డౌన్‌

షిల్లాంగ్‌: క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో మేఘాల‌యా ముఖ్య‌మంత్రి క‌న్రాడ్ సంగ్మా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. షిల్లాంగ్ న‌గ‌రంలోనే కేసుల సంఖ్య ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌టంతో అక్క‌డ జూలై 26 (ఆదివారం) అర్ధ‌రాత్రి నుంచి జూలై 29 అర్ధ‌రాత్రి వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నెల 13, 14 తేదీల్లో కూడా షిల్లాంగ్లో కంప్లీట్ లాక్‌డౌన్ విధించారు. 

కాగా, ఈ నాలుగు రోజుల కంప్లీట్ లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని, నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌ల‌వుతాయ‌ని షిల్లాంగ్ అధికారులు తెలిపారు. అయితే, అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌ర సేవ‌లు మాత్రం య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని చెప్పారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo