శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 18:30:07

రాజధానిలో రేపటి నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌

రాజధానిలో రేపటి నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌

గాంధీనగర్‌: దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో గుజరాత్‌ రెండో స్థానంలో ఉన్నది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజివ్‌ కేసులను తగ్గించడానికి, వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి రాజధాని నగరమైన గాంధీనగర్‌తోపాటు, కలోల్‌ మున్సిపాలిటీలో ఆదివారం నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అహ్మదాబాద్‌, సూరత్‌లో ఇప్పటికే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నారు. గుజరాత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్‌, సూరత్‌, గాంధీనగర్‌లోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో గత ఆరు రోజులుగా సుమారు 400 కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా గాంధీనగర్‌, కలోల్‌ మున్సిపాలిటీల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


logo