మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 22:33:11

మహారాష్ట్రలో ఈడీ దాడులు..

మహారాష్ట్రలో ఈడీ దాడులు..

ముంబై : మహారాష్ట్రలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించింది. విదేశీ నగదు మారకంలో అక్రమ లావాదేవీలను గుర్తించిన కేసుపై గత కొన్ని రోజులుగా ఈడీ పలు చోట్ల దాడులు చేపడుతోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఓ నిందితుడి ఇళ్లలో దాడులు చేశారు. మూడు చోట్ల గురువారం ఏకకాలంలో ఈడీ దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.62 లక్షల నగదు, ఏడు కిలోల బంగారు కడ్డీలను గుర్తించారు. నగదుకు సంబంధించిన పత్రాలు కూడా లేకపోవడంతో రూ.62 లక్షల నగదు, బంగారాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo