శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:12:41

ఢిల్లీ జైళ్ల‌లో 221 మందికి క‌రోనా

ఢిల్లీ జైళ్ల‌లో 221 మందికి క‌రోనా

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీ జైళ్ల‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఢిల్లీ జైళ్ల‌లోని సిబ్బంది, ఖైదీలు క‌లిపి మొత్తం 221 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 161 మంది సిబ్బంది, 60 మంది ఖైదీలు ఉన్నారు. అయితే, ఆ 60 మంది ఖైదీల‌లో 55 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా.. రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మ‌రో ఇద్ద‌రు ఖైదీలు మ‌ర‌ణించ‌గా, ఓ ఖైదీ జైలు నుంచి విడుద‌లై హోంక్వారెంటైన్‌లో ఉన్నాడు. ఇక క‌రోనా బారిన‌ప‌డ్డ 161 మంది జైలు సిబ్బందిలో 122 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. మ‌రో 39 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే ఖైదీలు సిబ్బంది క‌లిపి ఢిల్లీ జైళ్ల‌లో మొత్తం 41 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ జైళ్ల అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.                    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo