e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News వైద్య వృత్తిని అగౌర‌వ ప‌రుస్తున్న రాందేవ్‌: ఐఎంఏ ఫైర్‌

వైద్య వృత్తిని అగౌర‌వ ప‌రుస్తున్న రాందేవ్‌: ఐఎంఏ ఫైర్‌

వైద్య వృత్తిని అగౌర‌వ ప‌రుస్తున్న రాందేవ్‌: ఐఎంఏ ఫైర్‌

న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబాకు, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఏఎం) మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం తీవ్ర‌మ‌వుతున్న‌ది. తాజాగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసింది.

రాందేవ్ బాబా త‌న ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వైద్యుల‌ను అప్ర‌తిష్ఠ పాల్జేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వైద్య వృత్తిని అగౌర‌వ ప‌రుస్తూ వైద్యుల‌ను మాన‌సిక వేద‌న‌కు గురి చేసేలా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఈ మేర‌కు రాందేవ్ బాబాపై ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేష‌న్‌లో ఐఎంఏ ప్ర‌ధాన కార్యద‌ర్శి జ‌యేశ్ లాల్ ఫిర్యాదు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ అల్లోప‌తి ఔష‌ధాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ 14 పేజీల ఫిర్యాదు స‌మ‌ర్పించారు.

రాందేవ్ బాబా ఆధ్వ‌ర్యంలోని ప‌తంజ‌లి సంస్థ త‌యారు చేసిన ఔష‌ధం కొరోనిల్ క‌రోనాను త‌గ్గిస్తుంద‌న్న అంచ‌నాతో అల్లోప‌తి ఔష‌ధాల‌ను త‌ప్పు ప‌డుతున్నార‌ని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌ద్వారా ప్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ల‌బ్ధి పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు.

క‌రోనా చికిత్స‌కు రుజువుగానీ ఔష‌ధాల నుంచి ద్ర‌వ్య ల‌బ్ది పొంద‌డానికి సాధార‌ణ ప్ర‌జానీకాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌డానికి య‌త్నిస్తున్నార‌ని ఐఎంఏ ఆరోపించింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌యోజ‌నం పొందాల‌ని యోచిస్తున్నార‌న్న‌ది.

క‌రోనా వ్యాక్సినేష‌న్‌పై త‌ప్ప‌డు స‌మాచారాన్ని వ్యాపింప చేస్తున్న రాందేవ్ బాబాపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఐఏంఏ విజ్ఞ‌ప్తి చేసింది. ఇంత‌కుముందు 25 ర‌కాల వ్యాధుల‌కు శాశ్వ‌త చికిత్స ఉందా? అంటూ వైద్యుల‌కు, ఐఎంఏకు రాందేవ్ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

రాందేవ్ బాబాపై ఐఎంఏ మండి ప‌డిన వెంట‌నే ఆయ‌న స‌న్నిహితుడు ప‌తంజ‌లి సీఈవో ఆచార్య బాల‌క్రుష్ణ రియాక్ట‌య్యారు. భార‌త‌దేశాన్ని క్రైస్త‌వ దేశంగా మార్చేందుకు ఐఎంఏ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ జేఏ జ‌య‌లాల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎదురుదాడికి దిగారు.

యోగా, ఆయుర్వేదాన్ని ల‌క్ష్యంగా చేసుకుని వాటిని అపఖ్యాతి పాల్జేస్తున్నార‌ని ఐఏఎం అధ్య‌క్షుడిపై బాల‌క్రుష్ణ మండిప‌డ్డారు. త‌ద్వారా భార‌త్‌ను క్రైస్త‌వ దేశంగా మార్చేందుకు కుట్ర ప‌న్నార‌ని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

వ్యాక్సినేష‌న్ తోనే ఎకాన‌మీపై మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ

వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!

30 రోజుల్లో వాపస్‌

హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో రేపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

ఐటీ కొత్త రూల్స్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ట్విట్ట‌ర్ సంస్థ‌

మామిడి పండ్లు తిన‌గానే ఆ ఐదింటి జోలికి అస‌లే పోవ‌ద్దు..!

నన్నెవ‌రూ అరెస్ట్ చేయ‌లేరు : రాందేవ్ బాబా

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు

భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : గూగుల్ సీఈవో

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు

మెహుల్‌ చోక్సీ దొరికాడు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైద్య వృత్తిని అగౌర‌వ ప‌రుస్తున్న రాందేవ్‌: ఐఎంఏ ఫైర్‌

ట్రెండింగ్‌

Advertisement