ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 18:33:31

ఎయి‌ర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆధ్వర్యంలో టా‌ప్‌ కమాండర్ల సమావేశం

ఎయి‌ర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆధ్వర్యంలో టా‌ప్‌ కమాండర్ల సమావేశం

న్యూఢిల్లీ : చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తల నడుమ, తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి, ఈ నెలాఖరులో రఫెల్‌ యుద్ధ విమానాలు రానుండగా రాపిడ్‌ ఆపరేషన్‌ స్టేషన్‌పై చర్చించేందుకు ఈ వారం టాప్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్లు సమావేశం కానున్నారు. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల కమాండర్ల సదస్సుకు కోసం ఈ వారంలో అగ్రశ్రేణి కమాండర్లు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వివిధ భద్రతా అంశాలపై చర్చిస్తారని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు.

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కే భదౌరియా నేతృత్వంలో జరిగే ఈ సదస్సులో చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి, తూర్పు లడఖ్‌, ఉత్తర సరిహద్దుల బలగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫార్వర్డ్‌ పోస్టుల తరలింపు, వైమానిక దళం ఆయుధాలైన మిరాజ్‌ 2000, సుఖోయ్‌-30, మిగ్‌-29 ఫైటర్లు, ఫ్రాన్స్ నుంచి ఈ నెలాఖరుకు దేశంలోకి వచ్చే రఫెల్‌యుద్ధ విమానాల వేగవంతమైన తరలింపు, కార్యాచరణపై కూడా చర్చించనుంది. జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో భారత్‌ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కర్నల్‌ సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండడంతో భారత్‌ తన అస్త్ర శస్త్రాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే దిగుమతి కావాల్సి ఉన్న ఆయుధాలను వేగంగా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దీంతో పాటు అవసరమైతే అత్యవసర కొనుగోళ్లు చేసేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి రఫెల్‌ యుద్ధ విమానాలను వేగంగా తెప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నెల 27 నాటికి రఫెల్‌ యుద్ధ విమానాలు నాలుగు రానుండగా, అదనంగా రెండు ఇవ్వాలని భారత్‌ ఫ్రాన్స్‌ కోరిన విషయం తెలిసిందే.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo